TG: రేవంత్ సర్కార్ జనవరి 26న 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా.. మార్చి 1న HYD, ఉమ్మడి రంగారెడ్డి, MBNR జిల్లాల్లో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ జిల్లాల్లో మాత్రమే ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని ఎంపిక చేశారు. వచ్చే నెల 8 తరువాత మిగతా జిల్లాల్లో జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. 1న పంపిణీ చేయనున్న మూడు జిల్లాల్లో దాదాపు 1.12 లక్షల మంది రేషన్‌కార్డులకు అర్హులని ప్రాథమికంగా గుర్తించినట్లు పౌరసరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి.