న్యూజిలాండ్ పేస్ బౌలర్ డగ్లస్ బ్రాస్‌వెల్‌పై ఒక నెల నిషేధం వేటు పడింది. అతను నిషేధిత డ్రగ్స్ (కొకైన్) తీసుకోవడంతో న్యూజిలాండ్ స్పోర్ట్స్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అతడు కొకైన్ తీసుకుని వైద్య పరీక్షలో దొరికిపోయాడు. దీంతో అతడిపై న్యూజిలాండ్ స్పోర్ట్స్ కమిషన్ మూడు నెలల పాటు నిషేధం విధించింది. అయితే బ్రాస్‌వెల్ తను కొకైన్ వాడినందుకు పశ్చాత్తాపపడుతూ, వైద్యం చేయించుకోవడంతో సస్పెన్షన్‌ను ఒక నెలకు కుదించింది.