AP: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉంటూ మంత్రి పదవితో పాటు ఉమ్మడి ఏపీలో తొలి మహిళా స్పీకర్ గా పనిచేసిన కావలి ప్రతిభాభారతి రాజకీయంగా ఇప్పుడు రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. ఆమె తన కుమార్తె కావలి గ్రీష్మను రాజకీయ వారసురాలిగా ముందుకు తెచ్చారు. 2019లోనూ 2024 ఎన్నికల్లోనూ రాజాం నుంచి కుమార్తెకి టికెట్ కోసం ఆమె ప్రయత్నం చేశారు. అయితే ఆమెకు ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇవ్వకపోయినా నామినేటెడ్ పదవి అయితే దక్కిందని ఆమె వర్గం హర్షిస్తోంది. ఇక 2029 ఎన్నికల్లో కచ్చితంగా ఆమెకు టికెట్ దక్కుతుందని అంటున్నారు.