జన్నారం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
దస్తురాబాద్ మండలం మున్యాల్ గ్రామానికి చెందిన ఎమునూరి రాజు (26) పని చేస్తానని గ్రామంలో కొందరి దగ్గర డబ్బులు తీసుకుని పని చేయకుండా ఊర్లు పట్టుకుని తిరిగేవాడు. మద్యానికి బానిసైన రాజు పని చేయకుండా, తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి మందలించారు. మనస్తాపానికి గురైన రాజు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు శనివారం ఎస్సై తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.