AP: ‘తొలి ప్రేమ’ సినిమాకు తనకు వచ్చిన రూ.15 లక్షల రెమ్యూనరేషన్‌లో రూ.లక్షన్నర వెచ్చించి పుస్తకాలు కొన్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇవాళ విజయవాడలో నిర్వహించిన పుస్తక మహోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘పది పుస్తకాలు చదవాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నా, ఒక ప్రణాళికతో పుస్తకాలను చదువుతూ మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి. సాహితీ ప్రియులు కావాలి. తెలుగు భాషను పరిరక్షించే సైనికులు కావాలి’ అని పవన్ అన్నారు.