డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ వీడియో చేశారు. ఈ వీడియోలో "మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయట పడటం కోసం.. మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం చాలా విలువైనది. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించండి." అని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.