AP: నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే సంపన్న సీఎంగా నిలవడంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ‘ఏడీఆర్ రిపోర్టు ప్రకారం సుమారు రూ.వెయ్యి కోట్లతో దేశంలోనే అత్యంత ఆస్తి కలిగిన సీఎంగా చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎలాంటి అవినీతి, అక్రమాలు చేయకుండా 2 ఎకరాల ఆసామి కొడుకు రూ.931 కోట్లు ఎలా సంపాదించారు’? అని ట్వీట్ చేశారు.