పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కడెం మండలంలో చోటుచేసుకుంది. చిట్యాల్ గ్రామానికి చెందిన పందిరి గంగారాం(27) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య, తల్లి మందలించగా క్షణికావేశంలో పురుగుల మందు సేవించాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ తెలిపారు.