బంగ్లాదేశ్ లోని హిందువులను కాపాడాలంటూ హిందూ సంఘాల పిలుపుమేరకు ఖానాపూర్ పట్టణంలో బంద్ ప్రారంభమైంది. అక్కడి హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలకు నిరసనగా ఖానాపూర్ బందుకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఖానాపూర్ పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా వారి దుకాణాలను మూసివేశారు. అలాగే హిందూ సంఘాల నాయకులు బందును పర్యవేక్షిస్తున్నారు. హిందువులను కాపాడే విధంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.