దస్తూరాబాద్: విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలి

57చూసినవారు
దస్తూరాబాద్: విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని దస్తూరాబాద్ మండల విద్య అధికారి టీ. గంగాధర్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వంట గదిని, గోదాంలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వంట గదిని, గోదాంలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్ వో తిరుమల, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్