స్నేహితుల సాయం

81చూసినవారు
స్నేహితుల సాయం
కడం మండలం పెద్దూర్ తండాకు చెందిన స్నేహితుడు ఫోటో గ్రాఫర్ సుధాకర్ ఆనారోగ్యంతో మరణించగా, 2009 ఎస్సెస్సి క్లాస్ మేట్ బ్యాచ్ కు చెందిన పెద్దూర్ యువకులు శోకసంద్రంలో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. శనివారం 20 వేల నగదు పోగు చేసి మృతుడి భార్య రజితకు అందించారు. ఈ కార్యక్రమంలో క్లాస్మేట్స్ శ్రీరామ్, ప్రశాంత్, అంజన్న, మనోజ్, నాగరాజు, భాను, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.