గనిలో చిక్కుకున్న 15 మంది సురక్షితం

55చూసినవారు
గనిలో చిక్కుకున్న 15 మంది సురక్షితం
రాజస్థాన్‌లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ గనిలో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహన్ గనిలో గత రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున వారిని రక్షించినట్లు అధికారులు చెప్పారు. ఉద్యోగులను తీసుకువెళ్లే వర్టికల్ లిఫ్ట్ కూలడంతో ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిలో ముగ్గురిని ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు డాక్టర్ మహేంద్ర సింగ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్