సహాయ చర్యల పర్యవేక్షణ

83చూసినవారు
సహాయ చర్యల పర్యవేక్షణ
ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట గ్రామ శివారులో చేపట్టిన సహాయ చర్యలను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పర్యవేక్షించారు. మంగళవారం సాయంత్రం జన్నారం మండల పర్యటనను ఎమ్మెల్యే ముగించుకుని ఉట్నూర్ పట్టణానికి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో బీర్సాయిపేట గ్రామ శివారులో ఉన్న ప్రధాన రహదారిపై ఒక చెట్టు పడిపోయి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఎమ్మెల్యే అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి అధికారుల సహాయ చర్యలను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :