ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ జిల్లా నాయకులు ఎస్. రాజేష్ కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం తర్వాత ప్రజలకు పనులు దొరికేది ఉపాధి పనులతోనే అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులకు ఉపాధి పనులను అనుసంధానిస్తే చాలా గ్రామాల్లో నిరుపేదలకు ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు.