విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న రీయంబర్స్మెంట్ డబ్బులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఉట్నూరు పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో విద్యార్థులతో కలిసి అధికారికి వినతి అందించారు. ఈ కార్యక్రమంలో బాబా శ్యామ్ టైగర్, క్రాంతి భూమన్న సాజిద్, జాడి వెంకటేష్, శ్రీకాంత్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.