నిర్మల్: పార్ పెల్లిలో వడ్డే ఓబన్న 178వ వర్థంతి
జిల్లాలోని లక్ష్మణచందా మండలంలోని పార్ పెల్లి గ్రామములో వడ్డే ఓబన్న 178వ వర్ధంతి ఆదివారం జరుపుకోవటం జరిగింది. రేనాటి వీరుడు, ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి కుడి భుజం అయిన ఓబన్న స్వతంత్ర కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన గొప్ప యోధుడు అన్నారు. ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కుల సంఘం అధ్యక్షుడు శివరాత్రి రవి, ఉపాధ్యక్షుడు దేషెట్టి సుధాకర్, సంఘ సభ్యులు అందరూ పాల్గొనటం జరిగింది.