నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వివిధ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో దుకాణ సముదాయాలకు టెండరు నిర్వహించారు. 10 దుకాణం గదులకు టెండర్లు నిర్వహించగా, దేవస్థానానికి రూపాయలు 8, 49, 703 ఆదాయం చేకూరిందని ఆలయ ఇన్ ఛార్జ్ కార్యనిర్వ హణాధికారి విజయ రామరాజు తెలిపారు.