భైంసాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో గురువారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్బిఐ కౌన్సిలర్ రాజేందర్ విద్యార్థులకు బ్యాంకు ద్వారా పొందే వివిధ రకాల ఇన్సూరెన్స్ పథకాలను వివరించారు. అదేవిదంగా సైబర్ క్రైమ్ ల ద్వారా మన ఖాతాల నుండి డబ్బులు ఏ విధంగా డబ్బులు మాయం చేస్తున్నారో వివరించారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.