సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో బాసర అర్జీయూకేటి వీసి గోవర్ధన్ పాల్గొన్నారు. విద్యా మండలి చైర్మన్ తో పాటు అన్ని యూనివర్సిటీల వీసిలు సీఎంతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యామండలి, వీసీలకు దిశానిర్దేశం చేశారు. వీసి గోవర్ధన్ మాట్లాడుతూ అర్జీయూకేటి పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.