నిర్మల్ జిల్లా బైంసాలో కొలువైన దుర్గామాత అమ్మవారి నిమజ్జనం ఆదివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గణపతి నిమజ్జనం ఉత్సవాల మాదిరిగా, దుర్గామాత నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.