అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం కామోల్ గ్రామానికి చెందిన బెంద్రి విఠల్ (60) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. జబ్బు తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.