వేరుశనగ సాస్ తిని 23 ఏళ్ల యువతి మృతి

64చూసినవారు
వేరుశనగ సాస్ తిని 23 ఏళ్ల యువతి మృతి
వేరుశనగ సాస్ తినడంతో అమెరికాకు చెందిన 23 ఏళ్ల యువతి అనూహ్యంగా మరణించింది. అలిసన్ పికరింగ్ అనే యువతికి ‘‘పీనట్ ఎలర్జీ’’ ఉంది. అయితే ఇటీవల ఆమె ఓ రెస్టారెంట్‌లో డేటింగ్‌కి వెళ్లిన సమయంలో తాను ఎప్పుడూ ఆర్డర్ చేసే వంటకం ఆర్డర్ చేసింది. అయితే, రెస్టారెంట్ ఈ రెసిపీలో మార్పులు చేసిన విషయం ఆమెకు తెలియదు. ఈ రెసిపీకి ‘‘పీనట్ సాస్’’ చేర్చడంతో కొన్ని నిమిషాలకే ఆమె అనారోగ్యం పాలై మరణించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్