శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన ఆవు దూడకు రైతు కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. తానుర్ మండలంలోని బోల్సా గ్రామానికి చెందిన జంగు పోతన్న యాదవ్ అనే రైతుకు చెందిన ఆవు దూడ మృతి చెందింది. రైతుకు చేదోడు వాదోడుగా నిలిచిన ఆవు దూడ మృతి చెందడంతో గ్రామస్తులు బాజా బజంత్రీలతో ఉరేగించి హిందు సంప్రదాయం ప్రకారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.