వర్షం కురావలని రైతుల పూజలు

78చూసినవారు
వర్షాలు మొహం చాటేయడం, పొలాల్లో మొలకలు వాడి పోతుండడంతో చేసేదేమీ లేక రైతులు దేవున్ని నమ్ముకుని వర్షం కోసం పూజలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ భైంసా మండలంలోని ఇలేగాం గ్రామంలో రైతులు వరుణుని కరుణ కోసం పూజలు చేపట్టారు. గ్రామ దేవతల ఆలయాలకు డప్పు చప్పులతో వెళ్లి దేవత మూర్తులకు గంగ జలాలతో జలాభిషేకం చేశారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్