నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం దట్టమైన పొగమంచు కమ్మేసింది, ఉదయం ఆరుగంటల నుంచి ఎనిమిది గంటల వరకు కొద్దీ దూరంలో ఉన్నవి కనిపించనంతగా మంచు కప్పేసింది. దగ్గరకు వచ్చేంత వరకు సైతం ఎదుటివారు కనిపించకపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వాహనదారులు హెడ్లైట్ల వెలుతురులో ప్రయాణం సాగించారు.