ముధోల్ మండలంలోని బోరేగాం గ్రామంలో కల్తీకల్లు విక్రయంపై శనివారం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కల్తీ కల్లు అమ్మకాలను ఆపివేయాలని మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కల్తీ కల్లు తో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ముధోల్ ఎస్సై సాయి కిరణ్ తో పాటు ఎక్సైజ్ అధికారులు మహిళలను సముదాయించి షాంపిళ్లను లాబరోటికి పంపిస్తామని తెలిపారు. దీంతో నిరసన తెలుపుతున్న మహిళలు శాంతించారు.