నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని వడతాల్ గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించాలని డా. బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో దళిత సంఘాలు నాయకులు మాట్లాడుతూ న్యాయం చేయాలని కోరారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుల బహిష్కరణ చేశారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో డా. బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు హన్మండ్ల శ్రావణ్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, భూమన్న, విఠల్, నారాయణ, దేవన్న, గజన్నతో పాటు దళిత యువజన సంఘాలు మహిళలు యువకులు పాల్గొన్నారు.