కుబీర్ మండలం జామ్గాం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సోలార్ బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన సగం వెంకన్న, లక్ష్మణ్ అనే రైతులు పంట రక్షణకు ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ బ్యాటరీలను దుండగులు ఎత్తుకెళ్లారని తెలిపారు.
సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరారు.