తానూర్ మండలలోని బోల్సా ప్రాథమిక పాఠశాలను బుధవారం మండల విద్యాధికారి బి. నరేందర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పరిశీలించారు. మరుగుదొడ్లు పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, తదితర వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాలు వండిపెట్టాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.