కర్ర గణేశ్ దర్శనానికి రెండు గంటల సమయం

65చూసినవారు
కుబీర్ మండలం సరిహద్దులోని పాలజ్ కర్ర వినాయకుని ఆలయంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో వినాయకుడి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.