బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం రాత్రి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్నారు. రెగ్యులర్ ఉప కులపతిని నియమించేవరకు తాము ఆందోళన కొనసాగిస్తామంటూ చెబుతున్నారు. తమకు కల్పించాల్సిన 17 డిమాండ్లు నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘం తెలిపింది. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.