సారంగాపూర్: ప్రమాదవశాత్తు నీటమునిగి వ్యక్తి మృతి
సారంగాపూర్ మండలంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. జౌలీ గ్రామానికి చెందిన మర్రిపెద్ద లింగయ్య ఆదివారం మధ్యాహ్నం స్వర్ణ డ్యాం వద్ద బట్టలు ఉతుకేందుకు వెళ్ళాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు సోమవారం డ్యాం వద్దకి వెళ్లి చూడగా లింగయ్య విగత జీవిగా పడివున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.