ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ ఇటీవలే ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన సందర్భంగా శుక్రవారం పాఠశాల చైర్మన్ డోలు ప్రవీణ్, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. చైర్మన్ ప్రవీణ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారి బాధ్యతను మరింత పెంచిందని, విద్యార్థులకు మరింత ఉత్తమ సేవలందించాలని సూచించారు.