ఢిల్లీలో జరిగిన నాగౌర్ ఎంపీ, RLP నేత హనుమాన్ బెనివాల్ కుమారుడి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ సందర్బంగా బాలుడిని నువ్వేం కావాలనుకుంటున్నావని కేంద్రమంత్రి అడిగితే.. బాలుడి నాన్న స్పందిస్తూ.. పెద్దయ్యాక మీలాగే కావాలనుకుంటున్నాడు సర్ అని అన్న అన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి పిల్లాడికి రాజకీయ నాయకుడివి మాత్రం కావొద్దని సూచించారు.