ఆసియాలోకెల్లా అతిపెద్దదైన ఇంధిరాగాంధీ స్మారక ‘తులిప్’ పూదోటను జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారు. పర్యాటకుల సందర్శనార్థం దీనిని తెరిచారు. 50 హెక్టార్ల విస్తీర్ణంలో 17 లక్షల పుష్పాలు వికసించిన ఈ తోట వర్ణరంజితంగా శోభిల్లుతూ చూపరులను మైమరపింపజేస్తోంది. డాల్ సరస్సుకు, జబర్వాన్ కొండలకు మధ్య ఉన్న ఈ తోటను తెరవడంతో ఏటా కశ్మీర్‌లో పర్యాటక సీజన్ ప్రారంభమవుతుంది.