సప్తగిరి అత్యుత్సాహం.. ఇబ్బంది పడ్డ భక్తులు (వీడియో)

80చూసినవారు
టాలీవుడ్ నటుడు కమెడియన్ సప్తగిరి ఇటీవల చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ జాతరలో టీడీపీ నేత ఆర్టీవి బాబు, కమెడియన్ సప్తగిరి కలిసి హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు. అయితే హెలికాప్టర్ కిందకి దిగుతూ ఉండగా దాని నుండి వచ్చిన గాలికి అక్కడ వేసిన షామియానాలు కూలిపోయి భక్తులు ఇబ్బంది పడ్డారు. కూలిన షామియానాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్