బ్యాంక్ ఖాతాదారులు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై నలుగురు నామినీలను యాడ్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ బుధవారం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఇక ఇదే బిల్లుకు గతేడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఆమోదం తెలిపింది. అలాగే ఓ వ్యక్తి బ్యాంకులో ఉంచుకునేందుకు అనుమతించే మొత్తం నగదును ఈ బిల్లు ద్వారా రూ.5లక్షల నుంచి రూ.2 కోట్లకు కేంద్రం పెంచింది.