భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం నందిపేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా NSS వాలంటీర్లు రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారానే నేడు అందరూ ఫలాలను అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో NSS పీఓ లక్ష్మణ్ శాస్త్రి, కిషోర్, లావణ్య, తులసి రామ్, లెక్చరర్స్ సిబ్బంది పాల్గొన్నారు.