మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు విద్యార్థులలో, యువతలో దేశభక్తి నింపాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగాలో భాగంగా సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో 1000 మంది యువత, విద్యార్థులతో వివేకానంద చౌరస్తా నుండి మజీద్ వరకు జాతీయగీతాలతో, జాతీయ నాయకులను స్మరించుకుంటూ తిరంగా ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.