జక్రాన్‌పల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు రుచికరమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని, ఆదర్శ పాఠశాలను శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్‌కు వెళ్లిన ఆయన.. సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతతోపాటు విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని సైతం క్షుణ్ణంగా పరిశీలించారు.