మెట్‌పల్లి డివిజన్ ఏఈ ఇబ్రహీం మృతి పట్ల శ్రీరాం సాగర్ ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయ ఉద్యోగులు (పోచంపాడు) గురువారం కార్యాలయ ఆవరణలో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన అకాల మృతి పట్ల ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సాగర్ ప్రాజెక్టు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.