కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన యాదు(35) తన భార్య, పిల్లలతో ఆదివారం రాత్రి బైక్ పై వస్తుండగా జల్లాపల్లి శివారులో ట్రాక్టర్ ఢీ కొనడంతో బైక్ పై ఉన్న యాదు కుటుంబానికి తీవ్ర గాయాలు అయ్యాయి. దానితో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో యాదు మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.