Sep 22, 2024, 08:09 IST/బాన్సువాడ
బాన్సువాడ
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
Sep 22, 2024, 08:09 IST
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలం అంకోల్ తండా శివారులోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాలు ప్రకారం. అంకోల్ గ్రామానికి చెందిన కుర్మరామ్గోండ (40) శనివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.