బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం టానాకలన్ గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 164/3లో గల 2ఎకరాలు అన్యాకాంతం అయిన అంశం పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా విచారణ జరిపించాలని ఆదేశాలు ఇచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని సోమవారం సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట అధ్యక్షులు పాతూరి యాదగిరి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలనే బేఖాతర్ చేస్తున్నారని పేర్కొన్నారు .