కొలిప్యాక్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు...
జక్రాన్ పల్లి మండలంలోని కొలిప్యాక్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తెలుగు భాష ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పీకేవి ప్రసాద్ తెలుగు పండిత్ ను సత్కరించారు. ప్రసాద్ మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని తెలుగు భాష గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.