Sep 16, 2024, 11:09 IST/
రేపు, ఎల్లుండి వైన్ షాపులు బంద్
Sep 16, 2024, 11:09 IST
హైదరాబాద్లోని మందుబాబులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రెండ్రోజుల పాటు వైన్ షాపులు, బార్లు బంద్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రేపు(మంగళవారం) హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయి.