HMPVపై కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒక హెచ్‌ఎంపీవీ కేసు గుర్తించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో గుర్తించిన కేసులు చైనా వేరియంట్ అని చెప్పలేమని, దీనిపై కేంద్రమే స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండురావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంపీవీపై కేంద్రం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.