దేశంలో HMPV వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే బెంగళూరులో రెండు, అహ్మదాబాద్‌లో ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతాలో ఐదు నెలల చిన్నారికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ వైరస్ వ్యాప్తిపై ఆందోళన వద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.