గుర్తు తెలియని మృతదేహం కలకలం

15915చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం కలకలం
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామ పరిధిలో ఆదివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు బీబీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రభాకర్ మాట్లాడుతూ.. జనగామ గ్రామం నుంచి అంబర్ పేట్ గ్రామానికీ వెళ్ళే దారిలో రోడ్డు పక్కన పొలంలోని బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఉన్నాడని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే బీబీపేట్ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్