పొతంగల్: ఉచిత కంటి వైద్య శిబిరం
బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో పోతంగల్ మండల కేంద్రంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 64 మందికి కంటి పరీక్షలు చేశారు. 21 మందికి మోతి బిందు ఉన్నట్లు గుర్తించామని ఆప్తమాల్ అసిస్టెంట్ సతీష్ కుమార్ తెలిపారు. వారిని లయన్స్ కంటి ఆసుపత్రికి తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంధపు పవన్, క్యాంప్ ఇంఛార్జి హనుమంత్ రావు, కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.